భారతదేశం, జూలై 8 -- వింబుల్డన్ 2025 టోర్నీలో విరాట్ కోహ్లి, అనుష్క శర్మ తళుక్కుమని మెరిశారు. టెన్నిస్ లెజెండ్ నొవాక్ జకోవిచ్ మ్యాచ్ ను లైవ్ గా చూశారు. ఈ మ్యాచ్ కు విరుష్క జోడీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. విరాట్, అనుష్క లండన్ లో ఉంటున్న సంగతి తెలిసిందే. లండన్ వీధుల్లో స్వేచ్ఛగా చక్కర్లు కొడుతుండటంతో పాటు టైమ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ లవ్ జంట అదిరిపోయిందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

జకోవిచ్, ఆస్ట్రేలియాకు చెందిన అలెక్స్ డి మినార్ మధ్య జరిగిన వింబుల్డన్ పురుషుల రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌కు విరాట్ కోహ్లి, అనుష్క శర్మ హాజరయ్యారు. గత సంవత్సరం వింబుల్డన్ ఫైనలిస్ట్ జకోవిచ్ ఈ మ్యాచ్ లో తొలి సెట్లో 1-6 తేడాతో ఓడిపోయినా తిరిగి పుంజుకుని మ్యాచ్ గెలిచాడు. భారత్, ఇంగ్లాండ్ అయిదు టెస్టుల సిరీస్ లో కోహ్లి ఆడతాడని అంతా అనుకున్నారు. కానీ కోహ్లి సడన్ ...