Hyderabad, జూన్ 19 -- బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ప్రస్తుతం లండన్‌లో తన రూమర్డ్ బాయ్‌ఫ్రెండ్ శిఖర్ పహారియాతో కలిసి చిల్ అవుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఈ జంట లండన్ వీధుల్లో ఒకరి చేతిలో మరొకరు చేయి వేసి నడుస్తూ రొమాంటిక్‌గా కనిపించారు. వాళ్ల పక్కనే జాన్వీ చెల్లెలు ఖుషీ కూడా కనిపించింది.

జాన్వీ కపూర్ ఫ్యాన్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసిన వీడియోలో జాన్వీ కపూర్.. బ్లాక్ ట్యూబ్ టాప్, జాగర్ ప్యాంట్స్‌తో క్యాజువల్‌గా కనిపించింది. లూజ్ హెయిర్, మినిమల్ మేకప్‌తో ఆమె సింపుల్‌గా ఉంది. శిఖర్ కూడా క్యాజువల్ టీ షర్ట్, వైట్ ప్యాంట్స్‌లో స్టైలిష్‌గా కనిపించాడు.

రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తి తీసిన ఈ వీడియోలో జాన్వీ నవ్వుతూ, శిఖర్‌తో చేతులు కలిపి నడవడం చూడొచ్చు. ఈ జంటతో పాటు జాన్వీ చెల్లెలు, నటి ఖుషీ కపూర్ కూడా ఉంది. ఖుషీ వైట్ టాప్, ...