భారతదేశం, డిసెంబర్ 29 -- ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా నమోదయ్యే క్యాన్సర్లలో లంగ్ క్యాన్సర్ ఒకటి. కానీ దురదృష్టవశాత్తూ, చాలా కేసులు ముదిరిన దశల్లో తప్ప గుర్తించలేకపోతున్నారు. అవగాహన పెరిగి, ముందుగా గుర్తించడం, నివారణ చర్యలు తీసుకోవడం ద్వారా ఎన్నో ప్రాణాలు కాపాడవచ్చు.

భారతదేశంలో లంగ్ క్యాన్సర్, క్యాన్సర్ మరణాలకు కారణమయ్యే ముఖ్యమైన వ్యాధుల్లో ఒకటిగా నిలుస్తోంది. 2025 నాటికి పురుషుల్లో సుమారు 81,219 కొత్త కేసులు, స్త్రీల్లో 30,000 పైగా కేసులు నమోదయ్యే అవకాశం ఉంది.

లంగ్ క్యాన్సర్ అనగానే స్మోకింగ్‌తో లింక్ ఉన్న వ్యాధి అనే భావన ఇప్పటికీ ఉంది కానీ, ఇప్పుడు పొగ త్రాగని వాళ్లలోనూ ఈ వ్యాధి పెరుగుతోందని తెలుసా? మరీ ముఖ్యంగా భారతీయ స్త్రీలల్లో. కారణం? వాయు కాలుష్యం, గ్యాస్ స్టౌ, చెక్కలు, బొగ్గు వంటి ఇండోర్ ఫ్యూయల్ ద్వారా వచ్చే పొగకి ఎక్కువగా ఎక్స్‌పోజ్...