భారతదేశం, ఆగస్టు 24 -- బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొణె, రణవీర్ సింగ్ కూతురు దువా ఫేస్ రివీలైంది. ఎయిర్ పోర్టులో దువాను ఓ అభిమాని వీడియో తీశాడు. ఈ వీడియో వైరల్ గా మారింది. అయితే స్టార్ కపుల్ ప్రైవసీని గౌరవించకుండా, ఇలా దువా ఫేస్ రివీల్ చేయడంపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

బాలీవుడ్ లో కొత్త తల్లిదండ్రులు దీపికా పదుకొణె, రణవీర్ సింగ్ తమ కుమార్తె దువా పదుకొణె సింగ్ ముఖాన్ని ఇప్పటికీ పబ్లిక్ కు రివీల్ చేయలేదు. గతేడాది వీళ్లకు పాప జన్మించింది. తాజాగా ఓ అభిమాని దీపికాను, ఆమె కూతురు దువాను ఎయిర్ పోర్టులో రికార్డ్ చేశాడు. తన కుమార్తె వీడియోను రికార్డ్ చేయడంపై దీపికా తీవ్రంగా స్పందించినప్పటికీ ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. దువా ఫోటోలను తీయొద్దని, ముఖాన్ని బయటకు చూపించొద్దని ఇప్పటికే పాపరాజీలు, అభిమానులు, మీడియాను దీపికా దంపతులు కోరారు. కానీ ఇ...