భారతదేశం, ఆగస్టు 14 -- బైక్ ట్యాక్సీ, రైడ్-హెయిలింగ్ సేవలతో బాగా పేరు పొందిన ర్యాపిడో సంస్థ ఇప్పుడు ఫుడ్ డెలివరీ రంగంలోకి అడుగుపెట్టింది. 'ఓన్లీ' పేరుతో ప్రత్యేకమైన ఫుడ్ డెలివరీ యాప్‌ను తాజాగా ప్రారంభించింది. ప్రస్తుతం ఈ యాప్​ సేవలు బెంగళూరులో అందుబాటులోకి వచ్చాయి. నగరంలోని కోరమంగళ, హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్, బీటీఎం లేఅవుట్‌ అనే మూడు ప్రాంతాల్లో సంస్థ ఈ సేవలను ప్రారంభించినట్లు సమాచారం.

ఫుడ్ డెలివరీ దిగ్గజాలైన స్విగ్గీ, జొమాటోలకు గట్టి పోటీ ఇచ్చేలా ర్యాపిడో ఈ కొత్త యాప్‌ను తీసుకొచ్చింది. ఈ యాప్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తే, ఇతర యాప్‌ల కంటే 15 శాతం తక్కువ ధరకే లభిస్తుందని కంపెనీ చెబుతోంది. దీనికి కారణం 'జీరో కమిషన్' మోడల్! ఇతర ఫుడ్ డెలివరీ యాప్‌లు రెస్టారెంట్ల నుంచి 30 శాతం వరకు కమిషన్ తీసుకుంటాయి. కానీ ర్యాపిడో మాత్రం రెస్టారెంట్ల నుంచి ఎలాంటి కమిషన్...