భారతదేశం, జనవరి 25 -- ఈ నెల ఆదివారం ప్రకటించిన పద్మ అవార్డుల జాబితాలో క్రీడాకారులైన రోహిత్ శర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్ లకు పద్మశ్రీ పురస్కారం దక్కింది. దిగ్గజ టెన్నిస్ ఆటగాడు విజయ్ అమర్ నాథ్ కు పద్మభూషణ్ అవార్డు వరించింది. గతంలో ఈ గౌరవాన్ని అందుకున్న క్రికెటర్ల జాబితాలో వీరు కూడా చేరారు. హర్మన్‌ప్రీత్, రోహిత్ కంటే ముందు 40 మంది క్రికెటర్లు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. హర్మన్‌ప్రీత్ ICC వరల్డ్ కప్ గెలిచిన తొలి భారత కెప్టెన్‌గా చరిత్ర సృష్టించింది. గత సంవత్సరం ఇంట్లో జరిగిన ICC మహిళల ప్రపంచ కప్ టైటిల్‌ను ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి, భారత జట్టుకు తొలిసారిగా అందించింది. మరోవైపు, రోహిత్ శర్మ 9 నెలల వ్యవధిలో రెండు ICC టైటిళ్లను భారత్ కు అందించాడు.

రోహిత్ శర్మకు పద్మశ్రీ

క్రీజులో నిలబడితే చాలు పరుగుల తుపాను సృష్టించే రోహిత్ శర్మకు అరుదైన ఘనత ...