భారతదేశం, మే 20 -- గతంలో పశ్చిమ బెంగాల్ వైపు నుంచి ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాలకు రోహింగ్యాలు వలసదారులు వచ్చారని.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా 2017-18 ప్రాంతాల్లో కోల్‌కతా నుంచి స్వర్ణకార వృత్తి నిమిత్తం చాలా అధికంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వచ్చారని చెప్పారు. రోహింగ్యాల మూలాలు మయన్మార్ లో ఉన్నాయన్న పవన్.. వారి వలసలతో స్థానిక యువత నిరుద్యోగ సమస్య ఎదుర్కొంటోందని వివరించారు.

'తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలనేది ప్రధాన డిమాండ్. తెలంగాణ ఏర్పాటులో ఉన్న మూడు ప్రధాన డిమాండ్లలో స్థానికులకే ఉద్యోగాలు అనేది కూడా కీలక నినాదం. అయితే రోహింగ్యాలు దేశం దాటి వచ్చి ఇక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకుంటూ.. రేషన్, ఆధార్, ఓటరు కార్డులు పొందుతున్నారు. మన యువతకు చెందాల్సిన ఉద్యోగాలు, వ్యాపారాలు వారు చేసుకుంటున...