Hyderabad, మే 5 -- మూడేళ్ల కిందట తన మధురమైన వాయిస్ తో ఇండియన్ ఐడల్ 12 సీజన్ విజేతగా నిలిచిన సింగర్ పవన్‌దీప్ రాజన్. ఉత్తరాఖండ్ కు చెందిన ఈ సింగర్ సోమవారం (మే 5) తెల్లవారుఝామున 3.40 గంటలకు జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం తర్వాత అతడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇండియన్ ఐడల్ సింగింగ్ షో ద్వారా పాపులర్ అయిన సింగర్ పవన్‌దీప్ రాజన్ ప్రస్తుతం నోయిడాలోని ఫోర్టిస్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. కారు ప్రమాదంలో అతనికి ఒకటికి మంచి ఫ్రాక్చర్లు అయినట్లు గుర్తించారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే అతన్ని స్థానిక హాస్పిటల్ కు తీసుకెళ్లినా.. తర్వాత గాయాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో నోయిడాకు తరలించారు. నేషనల్ హైవే 9పై ఈ ప్రమాదం జరిగింది.

అతడు ప్రయాణిస్తున్న కారు ముందు వెళ్తున్న ట్రక్కును ఢ...