భారతదేశం, డిసెంబర్ 15 -- హైదరాబాద్ హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎంబీబీఎస్ విద్యార్థిని ఐశ్వర్య మృతి చెందింది. ఆర్టీసీ కాలనీ వద్ద రోడ్డు దాటుతున్న ఐశ్వర్య, ఆమె తండ్రి పాండును వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో వారిని వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

ఈ విషాదకర ఘటనలో ఐశ్వర్య ఆసుపత్రికి చేరుకునే లోపే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఆమె తండ్రి పాండును ప్రత్యేక చికిత్స కోసం మరొక ఆసుపత్రికి తరలించారు. ఐశ్వర్య మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా జనరల్ హాస్పిటల్ మార్చురీకి తీసుకెళ్లారు.

హైదరాబాద్ నగరంలోని టోలిచౌకి పోలీస్ స్టేషన్ పరిధిలోని పౌరామౌంట్ కాలనీ గేట్ నెంబర్ 4 సమీపంలో హత్య కలకలం రేపింది. అద్నాన్, బిలాల్ అనే వ్యక్తుల మధ్య గొడవ జరిగింది. ఈ సమాచారం తెలుసుకున్న...