భారతదేశం, ఆగస్టు 20 -- ఆరోగ్యంగా జీవించడానికి, ఆయుష్షు పెంచుకోవడానికి వ్యాయామం అత్యంత శక్తిమంతమైన ఔషధమని ప్రపంచవ్యాప్తంగా నిరూపితమైంది. ప్రముఖ కార్డియాలజిస్ట్, ఫంక్షనల్ మెడిసిన్ నిపుణుడు డాక్టర్ అలోక్ చోప్రా కూడా ఈ విషయాన్ని బలంగా నొక్కి చెప్పారు. వ్యాయామం మన ఆయుర్దాయాన్ని ఎలా పెంచుతుందో ఆయన వివరించారు.

డాక్టర్ చోప్రా తన సోషల్ మీడియా పోస్ట్‌లో వ్యాయామాన్ని "దీర్ఘాయువు కోసం ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన ఔషధం"గా అభివర్ణించారు. "రోజుకు కేవలం 90 నిమిషాల వ్యాయామం చేయడం వల్ల చావు ముప్పు 15% తగ్గుతుంది. అంతేకాదు.. మీరు దాదాపు పది సంవత్సరాలు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంది" అని ఆయన స్పష్టం చేశారు.

శరీరానికి అస్సలు కదలిక లేకపోవడం (Inactivity) ధూమపానం (Smoking) కంటే కూడా ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. శారీరక శ్రమ వల్ల రక్తనాళాలు, గుండె, శ్వాస వ్య...