Hyderabad, సెప్టెంబర్ 2 -- ప్రతి ఇంట్లో కూడా స్త్రీ ఉదయాన్నే త్వరగా నిద్ర లేచి స్నానం చేసి, పూజగది శుభ్రం చేసుకుని, వంట చేసి, పూజ చేసుకుని మహానైవేద్యం పెట్టుకోవడం. ఇలా ఎవరికి నచ్చిన పద్ధతిని వాళ్లు పాటిస్తూ ఉంటారు. కానీ చాలా మంది తెలియక చేసే పొరపాటు ఇది.

చాలా మందికి ఈ సమాధానం తెలియదు. ఎక్కువగా ఇళ్లల్లో స్త్రీ పూజ చేస్తూ ఉంటుంది, పురుషులు పూజ చెయ్యరు. అయితే, నిజానికి ఎవరు పూజ చేయాలి? ఎవరు చేస్తే ఫలితం ఏ విధంగా ఉంటుంది వంటి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంటికి దీపం ఇల్లాలు అని చాలా మంది ఇళ్లల్లో స్త్రీలే పూజ చేస్తారు. కానీ నిజానికి ప్రతి రోజు పూజ చేయాల్సింది భర్త. ఇంటికి దీపం ఇల్లాలైనా దీపాన్ని పురుషుడు వెలిగించాలి. పూజా సంకల్పంలో కూడా ధర్మపత్ని సమేతస్య అని ఉంది, కానీ ధర్మపతి సమేతస్య అని ఎక్కడా లేదు. అంటే నిజానికి ఇంట్లో పూజ ...