భారతదేశం, జూలై 5 -- చురుకుగా ఉండటం, శారీరక శ్రమ లేని జీవనశైలికి దూరంగా ఉండటమే మంచి ఆరోగ్యానికి, దీర్ఘాయువుకు కీలకమని నిపుణులు చెబుతున్నారు. నడక అనేది అత్యుత్తమ వ్యాయామాలలో ఒకటి. ఎందుకంటే ఎవరి శరీర సామర్థ్యాన్ని బట్టి వారు వేగాన్ని, తీవ్రతను నిర్ణయించుకోవచ్చు.

సాంకేతికత మన ప్రపంచాన్ని ఆక్రమించి, అన్నీ ఇంటి వద్దకే వస్తున్న ఈ రోజుల్లో... బయటకు వెళ్లి చురుకుగా ఉండే అవకాశాలు తగ్గిపోయాయి. పది గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు, రక్తపోటు, మధుమేహం లేదా కీళ్ల సమస్యల వంటి అనేక జీవనశైలి వ్యాధులకు దారితీసే ప్రమాదం ఉంది.

నడక దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడమే కాకుండా, మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. నడకపై ఇటీవల జరిగిన ఒక కొత్త అధ్యయనం ప్రకారం... చురుకైన నడక వల్ల ఆరోగ్య ప్రయోజనాలు అనేక రెట్లు పెరుగుత...