Hyderabad, సెప్టెంబర్ 8 -- ప్రతి ఒక్కరూ కూడా వారి ఇంట్లో దీపారాధన చేయాలి. పూజ గదిలో రోజూ దీపం వెలిగించాలి. అదే విధంగా తులసి మొక్క ముందు దీపం వెలిగించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి, సంతోషంగా ఉండొచ్చు.

దీపారాధన అంటే శరీరాన్ని, మనసుని భగవంతునికి అర్పించి జ్ఞాన జ్యోతిని వెలిగించడమే. ఇంట్లో దీపారాధన చేయడం వలన సానుకూల శక్తి ప్రవహిస్తుంది. అయితే దీపారాధన చేసేటప్పుడు ఏ ప్రమిదలో వెలిగిస్తే ఎలాంటి ఫలితం కలుగుతుంది? ఎలాంటి లాభాలను ఎలా పొందవచ్చు అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

దీపం కాంతి జ్ఞానాన్ని, అజ్ఞానాన్ని తొలగిస్తుంది. దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగి వెలుగులు ప్రకాశిస్తాయి. దీపం దైవ శక్తిని కలిగి ఉంటుంది. అది మన జీవితంలో సుఖ సంతోషాలని తీసుకు వస్తుంది.

దీపం వెలిగించేటప్పుడు చాలా మంది రకరకాల ప్రమిదలను వాడుతారు. కొంత మంది వెండి క...