భారతదేశం, నవంబర్ 24 -- ప్రొటీన్ అనేది మన శరీరానికి అత్యవసరం. రోజువారీ ఆహారంలో దానిని తప్పనిసరిగా తీసుకోవాలి. సరైన ఆరోగ్యం, శరీర ధర్మాలు సక్రమంగా పనిచేయాలంటే, ప్రొటీన్ లక్ష్యాన్ని చేరుకోవడం చాలా కీలకం. మరి ఈ ప్రొటీన్‌ను అందించే ఆహార వనరులలో, గుడ్డు అద్భుతమైన ఎంపిక. దీనిని ఒక 'మల్టీ-టాస్కర్ ప్రొటీన్' అని చెప్పవచ్చు. ఎందుకంటే, గుడ్డు కేవలం ప్రొటీన్‌ను అందించడమే కాకుండా, ఇతర శారీరక విధులకు కూడా సహాయపడుతుంది.

ఎయిమ్స్, హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలలో శిక్షణ పొందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సేథీ... నవంబర్ 23న తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో కీలక విషయాలు పంచుకున్నారు. మీరు రెండు వారాల పాటు రోజూ గుడ్లు తింటే మీ శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో, గుడ్డు యొక్క శక్తివంతమైన పోషక విలువలు ఏంటో ఆయన వివరంగా తెలిపారు.

గుడ్డు మొత్తం పోషకాల...