భారతదేశం, నవంబర్ 3 -- Baahubali The Epic Box Office Collection Day 3: డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కెరీర్‌లో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్స్ అయిన బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కంక్లూజన్ సినిమాలను బాహుబలి ది ఎపిక్‌గా రీ రిలీజ్‌తో మళ్లీ తెరపైకి వచ్చాయి.

రీమాస్టర్ చేయబడిన బాహుబలి ది ఎపిక్ అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలై అతిపెద్ద ఓపెనింగ్ సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. కానీ, రెండో రోజు నుంచి మాత్రం ప్రభాస్ రెండు పాత్రలు పోషించిన బాహుబలి ది ఎపిక్ బాక్సాఫీస్ వద్ద మందగించింది.

బాహుబలి ది ఎపిక్ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఇండియాలో రూ. 1.15 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక రిలీజైన అక్టోబర్ 31 నాడు రూ. 9.5 కోట్ల నెట్ ఇండియా కలెక్షన్స్ రాబట్టి అదరగొట్టింది బాహుబలి ది ఎపిక్ మూవీ. ఇందులో తెలుగు ద్వారా రూ. 7.9 కోట్లు, హిందీలో 1.35 కోట్లు, క...