Hyderabad, ఏప్రిల్ 27 -- ప్రతి ముగ్గురిలో దాదాపు ఒకరు అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అయినప్పటికీ బరువు తగ్గించుకునేందుకు ఎటువంటి జాగ్రత్తలు పాటించడం లేదు. సమయం లేకపోవడం వల్లనో, ఇప్పుడు బయటకు వెళ్తే ఏమనుకుంటారోననే అనుమానంతోనో జిమ్‌కు వెళ్లడానికి కూడా తటపటాయిస్తుంటారు. మీకు కూడా అలాంటి అనుభవం ఉంటే, చింతించకండి. ఎందుకంటే ఫిట్‌నెస్ ఇప్పుడు ట్రెడ్‌మిల్, డంబెల్స్‌లతో మాత్రమే చేసేది కాదు. ఒక సాధారణ కుర్చీతో కూడా మీ బరువును తగ్గించుకోవచ్చు.

చైర్ ఎక్సర్‌సైజ్ అనేది మీ శరీరాన్ని చురుకుగా ఉంచుకోవడానికి ఒక స్మార్ట్ అండ్ ఈజీ సొల్యూషన్. అది కూడా జిమ్‌లో చెమట పట్టకుండా, ఇంట్లో లేదా ఆఫీసులో, మీరు సులభంగా ఒక కుర్చీ సహాయంతో మీ ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకోవచ్చు. కాబట్టి, మీకు ఫిట్ బాడీని ఇచ్చే కొన్ని చైర్ ఎక్సర్‌సైజ్‌ల గురించి తెలుసుకుందాం.

ఇది చాలా సులభ...