భారతదేశం, డిసెంబర్ 23 -- బాలీవుడ్ యంగ్ హీరో అహాన్ పాండే మంగళవారం అంటే డిసెంబర్ 23న తన 28వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. తన తొలి మూవీ 'సయ్యారా' (Saiyaara) కోసం అతడు చేసిన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రాక్‌స్టార్ లుక్ కోసం రోజుకు 30 గుడ్లు తినడం దగ్గర నుంచి కఠినమైన వర్కౌట్స్ వరకు అహాన్ పడిన కష్టం అంతా ఇంతా కాదు.

యువ నటుడు అహాన్ పాండే తన డెబ్యూ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. బొద్దుగా ఉన్న అహాన్.. కేవలం 40-45 రోజుల్లోనే సిక్స్ ప్యాక్ బాడీతో రాక్‌స్టార్‌లా మారిపోయారు. ఈ క్రెడిట్ అంతా వాళ్ళ అమ్మ, ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్ డీన్ పాండే (Deanne Panday), ట్రైనర్ అజర్ జహీర్ షేక్‌లదే.

అహాన్ తల్లి డీన్ పాండే ప్రముఖ ఫిట్‌నెస్ నిపుణురాలు. బిపాసా బసు, జాన్ అబ్రహం వంటి స్టార్లకు ఆమె ట్రైనింగ్ ఇచ్చింది. అహాన్ డైట్...