Hyderabad, మే 6 -- రోజుకు రెండు సార్లు బ్రష్ చేయడం వల్ల దంతాలు బలంగా, ఆరోగ్యకరంగా ఉంటాయి. నోటి దుర్వాసన, చిగుళ్లు, నాలుకకు సంబంధించిన అనేక రకాల సమస్యలు వస్తాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. అయితే తెలియని మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే రోజుకు రెండు సార్లు బ్రష్ చేయడం అలవాటు చేసుకోకపోతే గుండె జబ్బుల బారిన పడే ప్రమాదముందట. అవును నోటి ఆరోగ్యం మీ గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అదెలాగో తెలుసుకుందాం రండి.

మే 5న వెలువడిన పరిశోధనల ప్రకారం, నోటిలోని బ్యాక్టీరియా రక్తప్రవాహంలోకి ప్రవేశించి గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ విషయాన్ని వారు ఏయే అంశాల ఆధారంగా చెబుతున్నారంటే..

రక్తప్రవాహంలోకి చేరిన కొన్ని రకాల నోటి బ్యాక్టీరియా రక్త నాళాల లోపలి పొర అయిన ఎండోథెలియానికి అతుక్కుంటాయి. ఇది రక్తనాళాల పనితీరును దెబ్బతీస్తుంది. అంతేకాదు ఇన్ఫెక్షన్ ఇ...