భారతదేశం, జనవరి 10 -- చాలా కాలంగా గుడ్ల విషయంలో ఒక రకమైన అపోహ ఉంది. గుడ్లు ఎక్కువగా తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని, అది గుండె ఆరోగ్యానికి చేటు చేస్తుందని చాలా మంది భావిస్తుంటారు. అయితే, ఈ పాత వాదనలను పక్కన పెట్టాల్సిన సమయం వచ్చిందని అంటున్నారు అమెరికాకు చెందిన ప్రముఖ సర్జన్, వెల్నెస్ నిపుణులు డాక్టర్ దర్శన్ షా. ఆరోగ్యవంతులైన వ్యక్తులు రోజుకు నాలుగు గుడ్లు తిన్నా అది కొలెస్ట్రాల్ ముప్పు కాదని, నిజానికి అది ఒక 'న్యూట్రిషనల్ అప్‌గ్రేడ్' అని ఆయన వివరిస్తున్నారు.

ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆయన పంచుకున్న విశేషాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గుడ్ల గురించి ఆధునిక మెటబాలిక్, కార్డియోవాస్కులర్ పరిశోధనలు పూర్తిగా భిన్నమైన వాస్తవాలను వెల్లడిస్తున్నాయని డాక్టర్ షా పేర్కొన్నారు.

సాధారణంగా ప్రోటీన్ కోసం మనం మాంసంపై ఆధారపడతాం. కానీ, మాంసం కే...