భారతదేశం, ఏప్రిల్ 14 -- వేసవిలో భగ్గుమనే ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం పొందేందుకు ఎక్కువమంది రోజంతా ఏసీ గదుల్లోనే గడుపుతున్నారు. ఆఫీసులు, ఇళ్లు, వాహనాలు ఇలా అన్నింటా ఏసీ వాడుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే చాలా మంది ఏసీ లేకుండా జీవించలేని పరిస్థితి ఏర్పడింది. ఏసీలో ఉంటే సౌకర్యం, చల్లదనమే ఇందుకు కారణం. అయితే ఈ సౌకర్యం పక్కనే కొన్ని ఆరోగ్య సంబంధిత సమస్యలు కూడా ఉన్నాయని తెలుసుకోండి.ముఖ్యంగా చర్మానికి.

ఎక్కువ సేపు ఏసీలో గడపటం వల్ల చర్మం ఆరోగ్యం దెబ్బతిని అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తులతాయి. ఏసీ గాలి నునుపుగా ఉండటం, తేమ తగ్గిపోవడం వల్ల చర్మం పొడిగా మారే అవకాశముంటుంది. అలర్జీలు, చర్మం పై దద్దుర్లు, ఉబ్బు లాంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు కొన్ని సులభమైన జాగ్రత్తలు తీసుకుంటే చాలు. ఎలాంటి సమస్యలూ లేకుండా ACలో స...