భారతదేశం, నవంబర్ 9 -- గుంటూరు సమీపంలోని పెదకాకానిలో శంకర కంటి ఆసుపత్రి నూతన భవనం ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఆసుపత్రి ప్రత్యేకతలను నిర్వాహకులు ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. రోగి ఇంటి వద్దే వైద్యం అందించేలా సంజివనీ ప్రాజెక్టు పని చేయనుందని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పారు.

ఏపీలోని 5 కోట్ల మంది హెల్త్ రికార్డులన్నీ డిజిటలైజ్ చేసి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతామన్నారు. రాబోయే రోజుల్లో ఆరోగ్యం విషయంలో ప్రపంచానికి ఏపీ రోల్ మోడల్‌గా ఉంటుందన్నారు. ఆస్తులు ఎన్ని ఉన్నా.. మంచి ఆరోగ్యం లేకపోతే ఉపయోగం లేదని స్పష్టం చేశారు. అనారోగ్యమే నిజమైన పేదరికం అని చెప్పారు. ప్రజారోగ్యం విషయంలో శంకర ఐ ఆసుపత్రి కృషిని అభినందించారు.

'మన దేశంలో కుటుంబ వ్యవస్థ బలంగా ఉందంటే కంచి పీ...