Hyderabad, జూలై 23 -- మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన మరో సూపర్ థ్రిల్లర్ రోంత్ (Ronth). ఈ సినిమా ఈ మధ్యే జియోహాట్‌స్టార్ లోకి వచ్చింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుండటంతో మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. రాత్రి గస్తీకి వెళ్లే ఇద్దరు పోలీసుల చుట్టూ తిరిగే కథతో ఈ మూవీ ప్రేక్షకులను మంచి థ్రిల్ పంచుతోంది. ఈ నేపథ్యంలో మలయాళం నుంచి వచ్చిన ఇతర పోలీస్ థ్రిల్లర్స్ ఏవో ఒకసారి చూద్దాం.

ఈ ఏడాది మలయాళం నుంచి సూపర్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమా ఇది. ఆసిఫ్ అలీ ఓ పోలీస్ ఆఫీసర్ గా 40 ఏళ్ల కిందట జరిగిన ఓ హత్య కేసును ఛేదించే స్టోరీ ఇది. ఈ ఏడాది వచ్చిన బిగ్గెస్ట్ హిట్స్ లో ఇదీ ఒకటి. ఈ రేఖాచిత్రమ్ మూవీ ప్రస్తుతం సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఐఎండీబీలో 8.1 రేటింగ్ ఉంది.

నాయట్టు మూవీలో కుంచకో బొబన్, జోజు జార్జ్, నిమిషా సజయన్ లాంటి వాళ్లు నటించారు....