భారతదేశం, జనవరి 28 -- సినిమాలో రొమాంటిక్ సీన్లు కామనే. హీరో హీరోయిన్లతో కెమెరా ముందు రొమాన్స్ చేయించి డైరెక్టర్ ఈ సీన్లు రాబడతాడు. కానీ జాతిరత్నాలు సినిమాతో పాపులర్ అయిన డైరెక్టర్ అనుదీప్ మాత్రం దీనికి పూర్తిగా రివర్స్. రొమాన్స్ అంటేనే అతను అన్ కంఫర్ట్ గా ఫీల్ అవుతాడంటా. ఈ విషయాన్ని ఫంకీ మూవీ హీరో విష్వక్ సేన్, హీరోయిన్ కాయదు లోహర్ చెప్పారు.

విష్వక్ సేన్, కాయదు లోహర్ జంటగా నటించిన మూవీ 'ఫంకీ'. దీనికి అనుదీప్ డైరెక్టర్. వాలైంటైన్స్ డే సందర్బంగా ఈ చిత్రం ఫిబ్రవరి 13న రిలీజ్ కానుంది. రీసెంట్ గా మూవీ హీరోహీరోయిన్లు, డైరెక్టర్ తో సుమ ప్రమోషనల్ ఇంటర్వ్యూ నిర్వహించింది. ఇందులో రొమాన్స్ గురించి, అనుదీప్ గురించి కాయదు లోహర్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.

ఫంకీ సినిమాలో రొమాంటిక్ సీన్ల గురించి సుమ ప్రశ్నించింది. దీనికి విష్వక్ సేన్ వెటకారంగా బదు...