భారతదేశం, డిసెంబర్ 28 -- జనవరి 1వ తేదీ నుండి రైలు ప్రయాణికులు తమ ప్రయాణం ప్రారంభమయ్యే ముందు రైలు సమయాలను తనిఖీ చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది. రైళ్లకు సంబంధించిన సమాచారం, సంబంధిత స్టేషన్లలో సమయాలలో మార్పుల వివరాలను ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ (www.irctc.co.in) లేదా నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్(ఎన్‌టీఈఎస్) ద్వారా పొందవచ్చని తెలిపింది. సికింద్రాబాద్ లేదా కాచిగూడలో ప్రారంభమయ్యే లేదా ముగిసే 25 రైళ్లలో ఎనిమిది రైళ్ల సమయాలు ఎస్‌సీఆర్ పరిధిలోని ప్రారంభ స్టేషన్లలో స్వల్పంగా మార్చుతున్నట్టుగా సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటనలో పేర్కొంది. 5 నుంచి 30 నిమిషాల వ్యత్యా‌సం ఉండనుంది. అందుకే జనవరి 1 నుంచి రైలు ప్రయాణం చేసేవారు.. రైల్వే స్టేషన్‌కు ముందుగా రావడం మంచిది.

ఇక దేశంలో అప్డేట్ చేసిన షెడ్యూల్ ప్రకారం.. ప్రయాణికులకు అనుకూలమైన అనేక మార్పులను తీసు...