భారతదేశం, జనవరి 28 -- రైల్వేకోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ పై వచ్చిన లైంగిక వేధింపు ఆరోపణలు అత్యంత చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యవహారంపై జనసేన పార్టీ అధినాయకత్వం స్పందించింది. ఓ మహిళ ఆరోపణలు చేసిన నేపథ్యంలో విచారణకు ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించింది. టి.శివశంకర్‌, తంబళ్లపల్లి రమాదేవి, టి.సి.వరుణ్‌ని సభ్యులుగా ప్రకటించింది.

ఎమ్మెల్యేపై వచ్చిన వార్తలపై విచారణ చేయాలని కమిటీని జనసేన పార్టీ నాయకత్వం ఆదేశించింది. ఈ కమిటీ ముందు ఏడు రోజుల్లోపు ఎమ్మెల్యే శ్రీధర్‌ హాజరై వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. కమిటీ నివేదిక వెల్లడయ్యే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన విడుదలైంది.

రైల్వే కోడూరు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరపునఅరవ శ్రీధర్ ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం ప్రభుత్వ విప్ గా కూడా ఉన్నారు. అయితే ఆ...