భారతదేశం, డిసెంబర్ 25 -- సామాన్య రైలు ప్రయాణికుల జేబుకు చిల్లు పడనుంది. దేశవ్యాప్తంగా రైలు టికెట్ ధరలను పెంచుతూ రైల్వే శాఖ గురువారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. పెరిగిన ధరలు ఈ శుక్రవారం (డిసెంబర్ 26) నుంచే అమలు కానున్నాయి. ఏడాది కాలంలో రైల్వే చార్జీలను సవరించడం ఇది రెండోసారి కావడం గమనార్హం. గత జూలైలో కూడా ఒకసారి ధరలను పెంచిన సంగతి తెలిసిందే.

రైల్వే కార్యకలాపాల నిర్వహణలో స్థిరత్వం, ప్రయాణికులకు మెరుగైన సదుపాయాల కల్పన మధ్య సమతుల్యత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

కొత్త ధరల ప్రకారం.. ప్రయాణించే దూరం, కోచ్ కేటగిరీని బట్టి చార్జీల పెంపు ఉంటుంది.

ఆర్డినరీ క్లాస్: 215 కిలోమీటర్లకు మించి ప్రయాణించే సాధారణ తరగతి ప్రయాణికులకు కిలోమీటరుకు 1 పైసా పెరగనుంది.

మెయిల్/ఎక్స్‌ప్రెస్ & ఏసీ క్లాస్‌లు: నాన్-ఏసీ మెయిల్/...