భారతదేశం, జూలై 29 -- అమెరికా న్యూయార్క్​లో​ కాల్పుల కలకలం రేగింది! సెంట్రల్​ మ్యాన్​హట్టన్​లోని పార్క్​ అవెన్యూ అనే స్కైస్క్రాపర్​లో స్థానిక కాలమానం ప్రకారం సోమవారం ఈ ఘటన జరిగింది. న్యూయార్క్ పోలీస్ డిపార్ట్​ అధికారి సహా కనీసం నలుగురు కాల్పుల కారణంగా మరణించినట్లు సమాచారం. లాస్ వెగాస్​కు చెందిన 27 ఏళ్ల షేన్ తమురా అనే షూటర్ కూడా స్వీయ-గాయాలతో మరణించినట్లు న్యూయార్క్ పోలీసులు తెలిపారు.

అనుమానితుడు బుల్లెట్​ప్రూఫ్​ వెస్ట్​ ధరించి, ఏఆర్​ శైలి రైఫిల్​తో పార్క్​ అవెన్యూలోని స్కైస్క్రాపర్​ లోపల కాల్పులు జరిపినట్టు న్యూయార్క్​ పోస్ట్​ వార్తాపత్రిక వెల్లడించింది. మిడ్​టౌన్ మాన్​ట్టన్​లోని రద్దీగా ఉండే ప్రాంతంలో, గ్రాండ్ సెంట్రల్ స్టేషన్, రాక్​ఫెల్లర్ సెంటర్, మ్యూజియం ఆఫ్ మోడర్న్ ఆర్ట్​కు కేవలం కొన్ని బ్లాకుల దూరంలో ఈ ఘటన జరిగింది.

అనుమానిత షూటర్ ...