Andhrapradesh, సెప్టెంబర్ 6 -- రైతుల సమస్యలపై వైసీపీ పోరాటానికి సిద్ధమైంది. అన్నదాతల సమస్యల విషయంలో కూటమి ప్రభుత్వ తీరు నిర్లక్ష్యంగా ఉందని ఆరోపిస్తోంది. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే దిశగా అన్నదాత పోరు కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ మేరకు పోస్టర్ ను విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఆ పార్టీ ముఖ్యనేత సజ్జల వెల్లడించారు.

ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్తంగా వైయస్ఆర్‌సీపీ ఆందోళనలు చేపట్టనుందని పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ మేరకు శనివారం పార్టీ నాయకులతో కలిసి 'అన్నదాత పోరు' పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులకు కనీసం అవసరమైన మేరకు యూరియాను కూడా అందించలేని ఒక అసమర్థ పాలనను చూస్తున్నామని మండిపడ్డారు. కృత్రిమ కొరతను సృష్టించి, యూరియా బ్లాక్‌...