భారతదేశం, జూన్ 17 -- రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతు భరోసా నిధులు రైతన్నల ఖాతాల్లోకి చేరాయి. ఈరోజు (జూన్ 17, 2025) 3 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులందరికీ ఎకరానికి Rs.6,000 చొప్పున నిధులను జమ చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఇందుకోసం ప్రభుత్వం Rs.1551.89 కోట్లను విడుదల చేసిందని మంత్రి తెలిపారు.

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించిన వివరాల ప్రకారం ఈ విడతలో మొత్తం 10.45 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది. వీరందరికీ కలిపి 25.86 లక్షల ఎకరాలకు రైతు భరోసా నిధులు జమ అయ్యాయి. ఈ పథకం ద్వారా రైతులు తమ సాగు ఖర్చులను కొంతవరకు తగ్గించుకోవడానికి, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అవకాశం కలుగుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక ముఖ్యమైన హామీ ఇచ్చారు. ప్రస్తుతం 3 ఎ...