భారతదేశం, మే 14 -- తెలంగాణ ప్రభుత్వం రైతులకు త్వరలో గుడ్ న్యూస్ చెప్పనుంది. రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. నాలుగు నుంచి 10 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు ఈ నెలాఖరులోగా డబ్బులు జమ చేయాలని ఆర్థిక శాఖను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు సమాచారం.

రైతు భరోసా పథకం కింద తెలంగాణ ప్రభుత్వం సీజన్ కు ఎకరానికి రూ.6 వేల చొప్పున జమ చేస్తుంది. మొత్తం రెండు సీజన్లలో రూ.12 వేలు అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తుంది. ఈ ఏడాది జనవరి 26న రైతు భరోసా పథకాన్ని సీఎం ప్రారంభించారు. ఫిబ్రవరి 5, 11 తేదీల్లో రెండు దశల్లో నాలుగు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు డబ్బులు జమ చేశారు.

నాలుగు ఎకరాలు, ఆపై భూమి ఉన్న రైతులకు ఇంకా రైతు భరోసా డబ్బులు అందలేదు. పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పిం...