భారతదేశం, ఏప్రిల్ 21 -- తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో యాసంగి సీజన్ రైతు భరోసా సాయాన్ని అకౌంట్లలో జమ చేసేందుకు కసరత్తు చేస్తుంది. 4 ఎకరాలలోపు రైతులకు ఇప్పటికే సాయం అందించగా, ఆపైన భూమి ఉన్న రైతులందరికీ పూర్తిస్థాయిలో నిధులు విడుదల చేయనున్నారు. ఇందుకోసం రూ.4 వేల కోట్లు అవసరమని అధికారులు భావిస్తున్నారు. నిధుల సర్దుబాటు అనంతరం డబ్బులు జమపై ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది.

యాసంగి పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమ గత రెండు నెలల కిందటి నుంచే ప్రారంభమైంది. ఇప్పటి వరకు నాలుగు ఎకరాలలోపు రైతులకు రైతు భరోసా డబ్బులు పడ్డాయి. త్వరలోనే 4 ఎకరాలు, ఆ పైన ఉన్న రైతులందరికీ పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేయనున్నారు. దీనికి రూ.4 వేల కోట్ల నిధులు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. వీటిని పంపిణీ చేస్తే యాసంగి రైతు భరోసా పూర్తవు...