భారతదేశం, జూలై 15 -- తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం 5,61,313 మందికి కొత్త‌గా రేష‌న్‌కార్డులు మంజూరు చేసిన నేప‌థ్యంలో, దాదాపుగా 45,34,430 మంది దీని ద్వారా ల‌బ్ధిపొందనున్నారు. అప్ప‌టికే కార్డు ఉన్న కుటుంబాలు, కొత్త‌గా న‌మోదు చేసుకున్న వారితో క‌లుపుకొని, రాష్ట్రంలో 95.56 ల‌క్ష‌ల కుటుంబాలు ఇక నుంచి నెల‌వారీ ప‌బ్లిక్ డిస్ట్రిబ్యూష‌న్ సిస్ట‌మ్‌ (పీడీఎస్) ద్వారా స‌న్న‌బియ్యం పొంద‌నున్నాయి.

కాంగ్రెస్ ప్ర‌భుత్వం రేష‌న్‌కార్డుదారుల‌కు ఒక్కొక్క‌రికి 6 కేజీల స‌న్న‌బియ్యం ఉచితంగా అందిస్తోంది. ప్ర‌తి కుటుంబంలో స‌గ‌టున‌ ఐదుగురు స‌భ్యుల అంచ‌నాతో ఒక్కో కుటుంబానికి ప్ర‌తినెల 30 కేజీల స‌న్న‌బియ్యం ఉచితంగా అందుతోంది. సన్న బియ్యం బహిరంగా మార్కెట్లో కొంటే కిలో రూ. 50 చొప్పున నెల‌వారిగా రూ.1,500 ఖర్చవుతుందని అంచనా. ఈ లెక్క‌న సంవ‌త్స‌రానికి ప్ర‌తి కుటుంబానికి ...