భారతదేశం, మే 21 -- ఏపీలో రేషన్ సరఫరా కోసం వినియోగిస్తున్న మొబైల్ డెలివరీ యూనిట్ల వ్యవస్థను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. తాజా నిర్ణయంతో రేషన్ మాఫియా అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని ప్రభుత్వం చెబుతోంది.

రేషన్‌ బియ్యం స్మగ్లింగ్‌ వ్యవహారంపై పవన్ కళ్యాణ్‌ సీజ్ ద షిప్‌ ఎపిసోడ్‌ తర్వాత రాష్ట్రంలో అక్రమాలు ఆగిపోతాయని భావించినా అలా జరగలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ బియ్యం అక్రమాలపై పెద్ద ఎత్తున తనిఖీలు, దాడులు చేశారు.

ఈ క్రమంలో రేషన్‌ డీలర్లు, మొబైల్ డెలివరీ యూనిట్లు కలిసి రేషన్‌ బియ్యాన్ని కారు చౌకగా కొనుగోలు చేసి విదేశాలకు తరలిస్తున్నట్టు గుర్తించారు. దీంతో ఎండీయూలను రద్దు చేయాలని కూటమి ప్రభుత్వం భావించింది. తాజాగా క్యాబినెట్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా రేషన్ బియ్యాన్ని 2019కు ముందు రేషన్ దుకాణాల...