భారతదేశం, జూన్ 21 -- రాష్ట్రంలోని వృద్ధులు, దివ్యాంగులకు ఐదు రోజుల ముందే రేషన్ అందనుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాళ్ల ఇళ్ల దగ్గరకు తీసుకెళ్లి రేషన్ సరుకులను అందజేయనుంది.

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జులైలో ఇవ్వాల్సిన రేషన్ ను.. జూన్ 26వ తేదీ నుంచి డీలర్ల ద్వారా పంపిణీ చేయనున్నారు. రేషన్ సంస్కరణల్లో భాగంగా ప్రతి నెలా 26 నుంచి 30వ తేదీలోపు వృద్ధులు, దివ్యాంగులకు ఇళ్ల వద్ద రేషన్ అందించాలని నిర్ణయించామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

విజయవాడ కానూరు సివిల్ సప్లై భవనంలో శుక్రవారం మంత్రి నాదెండ్ల మనోహర్. చౌకధర దుకాణదారుల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన. జూన్ 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించిన రేషన్ సరుకుల పంపిణీ మొదటి 15 రోజుల్లోనే 89.64% విజయవంతంగా పూర్తి కావడం ఓ గొప్...