భారతదేశం, డిసెంబర్ 19 -- రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే చాలా మంది ఈ కార్డులు పొందారు. మరికొందరూ దరఖాస్తు చేసుకోగా. పరిశీలన దశలో ఉన్నాయి. ఇక పాత కార్డులో కూడా పేర్ల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. మీ-సేవా ద్వారా ఈ ప్రాసెస్ పూర్తి చేసుకుంటున్నారు.

కొత్తగా కార్డు పొందినవారితో పాటు పేర్లు ఎక్కిన వాళ్లు ప్రతి నెలా రేషన్ తీసుకుంటున్నారు. అయితే కొత్తగా పేర్లు నమోదు చేసుకున్నవారిలో చాలా మంది ఈకేవైసీ పూర్తి చేసుకోలేదు. అయితే ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు పౌరసరఫరాలశాఖ అధికారులు ప్రకటనలు కూడా చేశారు. రేషన్ కార్డు దారులందరూ ఈ-కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు.

ఇటీవలే రేషన్ కార్డు ఈకేవైసీకి సంబంధించి కొన్ని వార్తలు వైరల్ గా మారాయి. ఈకేవైసీ చేసుకోకపోతే జనవరి నుంచి రేషన్ కట్ చేస్తారని ఇందులో ఉంది. ఇదే అ...