భారతదేశం, జనవరి 20 -- సిట్ విచారణకు హాజరయ్యే ముందు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు మాట్లాడారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బావమరిది బాగోతం పొద్దున బయటపడగానే.. సాయంత్రం నోటీసులు ఇచ్చారన్నారు. సిద్దిపేటలో ఉంటే.. రాత్రి తన ఇంటి వద్దకు వచ్చి సిబ్బందికి నోటీసులు ఇచ్చి వెళ్లారన్నారు. చట్టాన్ని గౌరవించి తాను సిద్దిపేట నుంచి వచ్చి.. సిట్ విచారణకు వెళ్తు్న్నట్టుగా చెప్పారు.

'బిడ్డా నువ్వు ఎన్ని నోటీసులు పంపినా, ఎన్ని విచారణలకు పిలిచినా నిన్ను విడిచి పెట్టేది లేదు రేవంత్ రెడ్డి. ఎన్నికల ముందు అటెన్షన్ డైవర్షన్ కోసం చిల్లర రాజకీయాలు చేస్తున్నావు. మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. మేం తప్పు చేయలేదు. రాత్రి 9 గంటలకు నోటీసు ఇచ్చినా నేను సిద్దిపేట నుంచి వచ్చి హాజరవుతున్నా. దైర్యంగా వెళ్తున్నాం అడిగి...