Hyderabad, జూలై 4 -- సోషల్ మీడియా సెలబ్రిటీ ఊర్ఫీ జావేద్ 'ది ట్రైటర్స్' రియాలిటీ షో గెలిచిన తర్వాత తన మొదటి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ను షేర్ చేసింది. బిగ్‌బాస్ ఓటీటీ (2021) నుండి వారం రోజుల్లోనే వెళ్లిపోయినప్పటి నుంచి ఇప్పుడు 'ది ట్రైటర్స్' విజేతగా నిలవడం వరకు తన ప్రస్థానం గురించి ఆమె ఈ పోస్ట్‌లో పంచుకుంది. ఈ క్రమంలో తాను ఎదుర్కొన్న ద్వేషం ఎలాంటిదో తెలిపింది.

ది ట్రైటర్స్ సీజన్ 1 గెలిచిన తర్వాత శుక్రవారం (జులై 4) తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో ఊర్ఫీ జావెద్ ఓ పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ఆమె ఓ వీడియో షేర్ చేసింది. బిగ్ బాస్ నుంచి తనను బయటకు పంపే సీన్ తో మొదలై.. ట్రైటర్స్ లో తాను గెలిచినట్లు ప్రకటించడంతో ఊర్ఫి గట్టిగా అరవడం అందులో చూడొచ్చు.

ఈ వీడియోను షేర్ చేస్తూ, గత నాలుగు సంవత్సరాలుగా తన ప్రయాణం ఎంత కష్టమైందో ఊర్ఫీ గుర్తుచేసుకుంది. తాను చాలాసార...