Telangana,hyderabad, మే 30 -- తెలంగాణలో జరుగుతున్న మిస్ వర్డల్ పోటీలు తుది దశకు చేరాయి. రేపు (మే 31) తుది విజేతను ప్రకటిస్తారు. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో నిర్వహించనున్నారు. సాయంత్రం 6. 30 గంటలకు కార్యక్రమం షురూ అవుతుంది.

ప్రపంచ అందాల పోటీల్లో భాగంగా.. సుమారు 20 రోజుల పాటు పలు కార్యక్రమాలు జరిగాయి. సుందరీమణులు పలు కార్యక్రమాల్లో పాల్గొని తమ ప్రతిభను చాటారు. అంతేకాకుండా తెలంగాణలో ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించారు. తెలంగాణ జరూర్ ఆనా నినాదాన్ని ప్రపంచవ్యాప్తం చేశారని అధికారులు ఓ ప్రకటన ద్వారా తెలిపారు.

108 మంది పోటీదారుల నుంచి 10 మంది సెమీ ఫైనలిస్టులు, మొత్తం 40 మంది క్వార్టర్ ఫైనల్స్ కు చేరుతారు. కొందరు పోటీదారులు ఫాస్ట్-ట్రాక్ ఛాలెంజ్‌ల ద్వారా ఇప్పటికే క్వార్టర్ ఫైనల్స్‌ కు చేరుకున్నారు. ...