భారతదేశం, డిసెంబర్ 6 -- సంకష్టహర చతుర్థి: సంకష్టహర చతుర్థి నాడు వినాయకుడిని ప్రత్యేకించి పూజిస్తాము. ప్రతి నెలా కూడా కృష్ణ పక్షంలో, అంటే పౌర్ణమి తర్వాత వచ్చే చవితి నాడు సంకష్టహర చతుర్థి వస్తుంది. ఆ రోజున వినాయకుని ఆరాధించడం వలన అడ్డంకులు తొలగిపోయి ఆనందంగా ఉండొచ్చు. సుఖ సంతోషాలు, సిరి సంపదలు కలుగుతాయి.

సంకష్టహర చతుర్ధి నాడు వినాయకుడిని పూజించి ఉపవాసం ఉంటే చక్కటి ఫలితం కనపడుతుంది. అలాగే చాలా మంది వ్రతం కూడా చేస్తూ ఉంటారు. సంకష్టహర చతుర్ధి నాడు వినాయక వ్రతం ఆచరిస్తే సకల శుభాలు కలిగి ఆనందంగా ఉండొచ్చు.

పంచాంగం ప్రకారం చతుర్థి తిధి డిసెంబర్ 7 సాయంత్రం 6:24కి మొదలవుతుంది. డిసెంబర్ 8న వినాయకుడిని సంకష్టహర చతుర్థి నాడు సాయంత్రం గరికతో ఆరాధిస్తే ఎంతో మంచి జరుగుతుంది. డిసెంబర్ 7వ తేదీన చంద్ర దర్శనం తర్వాత వినాయకుడిని ఆరాధించాలి.

సంకష్టహర చతుర్ధి ...