భారతదేశం, జనవరి 2 -- జనవరి 3న వచ్చే పుష్య పౌర్ణమి చాలా విశేషమైనది. పుష్య పౌర్ణమి నాడు కొన్ని పరిహారాలను పాటించడం వలన విశేష ఫలితాలను పొందడానికి వీలవుతుంది. పుష్య పౌర్ణమి నాడు చేసే స్నాన, దానాలకు కూడా ఎంతో గొప్ప పుణ్యఫలితాన్ని పొందడానికి వీలవుతుంది. పుష్య పౌర్ణమి నాడు కొన్ని దానాలు చేయడం, పూజలు చేయడం, పద్ధతులను పాటించడం వలన నవగ్రహాలను కూడా శాంతింప చేయవచ్చు. నవగ్రహాల కారణంగా ఏర్పడే సమస్యల నుంచి బయటపడవచ్చు.

పౌర్ణమి జనవరి 3, అనగా రేపు వచ్చింది. కొన్ని ప్రత్యేకమైన పద్ధతులను పాటించడం వలన గ్రహాల కారణంగా ఏర్పడే సమస్యల నుంచి బయటపడవచ్చు. ఆ రోజు ఏం చేయాలి అనేది ఇప్పుడే తెలుసుకుందాం.

సూర్య కారణంగా దోషాలు తగ్గాలంటే కొన్ని పరిహారాలను పాటించండి. పుష్య పౌర్ణమి నాడు సూర్యుడిని శాంతింప చేయడానికి గోధుమలను దానం చేయండి. రాగి వస్తువులు, బెల్లం దానం చేస్తే కూడ...