భారతదేశం, ఏప్రిల్ 21 -- తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫస్టియర్‌,సెకండియర్‌ ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. ఫలితాలను ఆన్‌‌లైన్‌లో విడుదల చేస్తారు.మంగళవారం మధ్యాహ్నం ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మధ్యాహ్నం 12 గంటలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫలితాలను విడుదల చేస్తారని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు.

ఈ ఏడాది తెలంగాణలో దాదాపు 9.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలను https://tgbie.cgg.gov.in/ ఇంటర్ బోర్డు వెబ్‌సైట్‌తో పాటు హిందుస్థాన్ టైమ్స్‌ తెలుగు వెబ్‌సైట్‌ https://telugu.hindustantimes.com/ లో కూడా ఇంటర్‌ ఫలితాలను తెలుసుకోవచ్చు.

తెలంగాణలో ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్ధులు ఇప్పటికే ఫలితాల కోసం వేచి చూస్తున్నారు.ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు ఇప్పటికే విడుదల అయ్యాయి. దీంతో తెలంగాణ విద్యార...