Hyderabad, జూలై 19 -- వినోదభరితమైన కంటెంట్​‌తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఛానల్ జీ తెలుగు. ఆసక్తికరమైన మలుపులతో సాగుతున్న సీరియల్స్‌​తో పాటు సరికొత్త కాన్సెప్ట్స్‌తో నాన్ ఫిక్షన్ షోలతోనూ ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తోంది. ప్రత్యేక సందర్భాలను మరింత ప్రత్యేకంగా మలిచేందుకు ఎప్పుడూ ముందుండే జీ తెలుగు మరో ఈవెంట్‌తో సందడి చేయనుంది.

బోనాల సందర్భంగా మరో ప్రత్యేక కార్యక్రమంతో ప్రేక్షకుల ముందుకు రానుంది జీ తెలుగు. తెలంగాణ బోనాల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం 'బ్లాక్​‌బస్టర్​ బోనాలు' జూలై 20న ఆదివారం సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో ప్రసారం చేయనున్నారు.

జీ తెలుగు నటీనటుల ఆటపాటలు, అల్లరితో సందడిగా సాగిన ఈ కార్యక్రమానికి యాంకర్​ రవి, వర్షిణి వ్యాఖ్యాతలుగా వ్యవహరించనున్నారు. సంప్రదాయం, సంస్కృతి మేళవింపుతో ఘనంగా జరిగే ఈ కార్యక్రమంలో కళాకారుల ప్రదర్...