భారతదేశం, నవంబర్ 4 -- ప్రతి సంవత్సరం కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమి నాడు కార్తీక పౌర్ణమి జరుపుకుంటాము. ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి నవంబర్ 5, బుధవారం, అంటే రేపు వచ్చింది. కార్తీక పౌర్ణమి నాడు పూజలు, ఉపవాసాలు, దీపారాధన, నది స్నానం ఇలా భక్తులు శివుని అనుగ్రహం పొందడానికి పాటిస్తూ ఉంటారు. కొంత మంది రకరకాల పరిహారాలు కూడా పాటిస్తూ ఉంటారు.

కార్తీక పౌర్ణమి వచ్చేస్తోంది. ఆ రోజు చేసే పూజలకు, ఉపవాసాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఆ రోజు ఉపవాసము ఉంటే కోటి పూజలతో సమానమైన పుణ్య ఫలితం కలుగుతుంది. కార్తీక పౌర్ణమి నాడు నది స్నానం ఆచరించినా, వన భోజనాలు చేసినా, ఉసిరి దీపాన్ని వెలిగించినా ఎన్నో రెట్లు ఫలితం వస్తుంది.

కార్తీక పౌర్ణమి నాడు 365 వత్తులతో దీపాన్ని వెలిగించాలి. అలా చేయడం వలన శివుడుని సంవత్సరమంతా పూజించినంత పుణ్యఫలితం కలుగుతుంది. కాబట్టి పౌర్ణమి తిథి నాడ...