భారతదేశం, నవంబర్ 19 -- కార్తీక అమావాస్య 2025: కార్తీక మాసంలో వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైనది. ఈసారి కార్తీక అమావాస్య నవంబర్ 20 గురువారం నాడు వచ్చింది. కార్తీక అమావాస్య నాడు పూర్వికులను స్మరించుకోవడానికి, పూజించడానికి ఎంతో పవిత్రమైన రోజు. కార్తీక అమావాస్య నాడు పితృ దేవతలను ప్రసన్నం చేసుకోవచ్చు. పితృ దోషాలతో ఇబ్బంది పడుతున్న వారు కార్తీక అమావాస్య నాడు కొన్ని పరిహారాలను పాటించడం, దానధర్మాలు చేయడం వంటివి చేసినట్లయితే శుభ ఫలితాలు ఎదురవుతాయి. దోషాలన్నీ తొలగిపోయి సంతోషంగా ఉండొచ్చు.

పంచాంగం ప్రకారం కార్తీక మాసం కృష్ణపక్ష అమావాస్య గురువారం ఉదయం 9:43 కి మొదలవుతుంది, మధ్యాహ్నం 12:16 తో ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం అమావాస్యను చూడాలి. కనుక గురువారం నాడు అమావాస్య. అమావాస్య రోజున దానధర్మాలు చేయడం, పితృదేవతలను స్మరించుకోవడం మంచి రోజు. కార్తీక అమావాస్...