భారతదేశం, మే 12 -- ఈసారి ముందుగానే నైరుతి రుతుపవనాలు రాబోతున్నాయి. ఐఎండీ అంచనాల మేరకు... రేపు (మే 13) దక్షిణ అండమాన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాల్లోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. అండమాన్ సముద్రమే కాకుండా దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తాజా బులెటిన్ ద్వారా వెల్లడించింది.
దక్షిణ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలతో పాటు నికోబార్ దీవులు,అండమాన్ సముద్రం, మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు ప్రవేశిస్తాయని ఐఎండీ పేర్కొంది. ఇవి మరింతగా ముందుకు సాగేందుకు తదుపరి 4- 5 రోజులు వాతావరణం మరింత అనుకూలంగా మారే అవకాశం ఉంటుందని ఐఎండీ వెల్లడించింది.
సాధారణంగా జూన్ 1 లేదా మొదటి వారం నాటికి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయి. ఆ తర్వాత దేశమంతటా విస్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.