భారతదేశం, ఏప్రిల్ 21 -- ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత రాజ్ కసిరెడ్డి(కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి) మరో ఆడియో విడుదల చేశారు. మంగళవారం ఉదయం 11 నుంచి 12 గంటల మధ్య సిట్ విచారణకు హాజరవుతానని తెలిపారు. ఈ మేరకు సిట్ అధికారులకు సమాచారం ఇచ్చానని పేర్కొన్నారు. తన ముందస్తు బెయిల్ పిటిషన్ కు సంబంధించి హైకోర్టులో వాదనలకు జరుగుతున్నాయని, వీటికి సమయం పట్టేలా ఉందని, అందువల్ల సిట్ విచారణకు హాజరవ్వాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు.

మద్యం కుంభకోణం కేసులో తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని రాజ్ కసిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై న్యాయస్థానం తాజాగా విచారణ చేపట్టింది. అయితే మధ్యంతర రక్షణ కల్పించాలంటూ రాజ్ కసిరెడ్డి తరఫు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు అంగీకరించలేదు. ఈ పిటిషన్ ప...