భారతదేశం, ఏప్రిల్ 25 -- ఏపీలో మత్స్యకారులకు ఆర్ధిక సాయాన్ని అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం శనివారం ప్రారంభించనుంది. మత్స్యకారులను ఆర్ధికంగా ఆదుకునేలా 'మత్స్యకారుల సేవలో...' పేరుతో సాయం అందించనుంది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు 61 రోజుల పాటు సముద్రంలో వేట నిషేధ సమయంలో మత్స్యకారులు ఇబ్బందులు పడకూడదని ఒక్కో మత్స్యకార కుటుంబానికి రూ.20,000 ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

శనివారం శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, బుడగట్లపాలెం గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 'మత్స్యకారుల సేవలో...' పథకాన్ని ప్రారంభించనున్నారు. దీంతో 12 తీర ప్రాంత జిల్లాల్లో సముద్రం వేటపై జీవిస్తున్న 1,29,178 కుటుంబాలకు ఆర్ధికంగా రూ. 258 కోట్ల ప్రయోజనం కలుగుతుంది. కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు, ఆక్వారంగానికి ఎప్పుడూ అండగా ఉంటుందన్న నమ్మకాన్ని ఈ పథకాన్న...