Hyderabad, జూన్ 20 -- జేష్ఠ మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని యోగినీ ఏకాదశి అంటారు. హిందూ మతంలో యోగినీ ఏకాదశికి ఎంతో ప్రత్యేకత ఉంది. ప్రతి ఏకాదశి రోజున శ్రీ విష్ణుమూర్తిని ఆరాధించడం వలన విశేష ఫలితాలను పొందవచ్చు. యోగినీ ఏకాదశి నాడు భక్తితో ఉపవాసం ఉంటే, 88 వేల మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టిన పుణ్యం లభిస్తుంది.

యోగినీ ఏకాదశి జూన్ 21 శనివారం నాడు వచ్చింది. జ్యేష్ఠ మాసం కృష్ణ పక్ష ఏకాదశి జూన్ 21 ఉదయం 7:18కి మొదలవుతుంది, జూన్ 22 ఉదయం 4:27తో ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం చూడాలి కనుక జూన్ 21న యోగినీ ఏకాదశిని జరుపుకోవాలి.

శనివారం నాడు యోగినీ ఏకాదశి రావడం శుభప్రదం. ఈరోజు శ్రీ విష్ణుమూర్తిని భక్తి, శ్రద్ధలతో ఆరాధించడం వలన విశేష ఫలితాలను పొందవచ్చు. యోగినీ ఏకాదశి నాడు ఈ పనులు కచ్చితంగా చేయండి.

యోగినీ ఏకాదశి అదీ శనివారం వచ్చినందున, ఈరోజు సరిగ్గా విన...