భారతదేశం, మే 1 -- ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. విజయవాడ మీదు చెన్నై, కోల్‌కత్తా మార్గాల్లో ప్రయాణించే వారు ప్రత్యామ్నయ మార్గాల్లో ప్రయాణించడం ఉత్తమం.

వెలగపూడిలో శుక్రవారం అమరావతి రాజధాని పునర్నిర్మాణ కార్యక్రమానికిప్రధాని నరేంద్ర మోదీవస్తున్న నేపథ్యంలో శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి.

నోవోటల్ హోటల్ నుండి మహానాడు జంక్షన్, రమేష్ హాస్పిటల్ జంక్షన్, బెంజ్ సర్కిల్ వద్ద కుడివైపుకు తిరిగి మహాత్మ గాంధీ రోడ్ మీదుగా పోలీస్ కంట్రోల్‌రూమ్‌ జంక్షన్, ఫ్లైఓవర్, వినాయక టెంపుల్, సీతమ్మవారి పాదాలు అండర్ పాస్, ప్రకాశం బ్యారేజి మీదుగా సభా ప్రాంగణానికి వెళ్లాలి.

అన్ని భారీ వాహనాలు, మే 2వ తేదీ ఉదయం 05:00 గంటల నుండి సాయంత్రం 10.00 గంటల వరకు వేర్వేర...