భారతదేశం, జనవరి 24 -- రథసప్తమి చాలా విశేషమైన రోజు. రథసప్తమి పండుగ నాడు సూర్యభగవానుని భక్తితో ఆరాధిస్తే ఎంతో మంచి జరుగుతుంది. చాలా మంది రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అయితే జాతకంలో సూర్యుడి స్థానం బలంగా ఉన్నట్లయితే సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. అలాగే అందరికంటే ముందు ఉండొచ్చు. ఏ కష్టాలు ఉన్నా సరే తొలగిపోతాయి. అయితే, రథసప్తమి వేళ ఏం చేయాలి? ఎలాంటి పరిహారాలను పాటించాలి? రథసప్తమి నాడు సూర్యుడి అనుగ్రహాన్ని పొందడానికి ఎలాంటి వాటిని పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మాఘ మాసంలో సూర్యుని ఆరాధించడం చాలా విశేషమైనది. అందులోను ఆదివారం రావడం మరింత విశేషం. రథసప్తమి నాడు ఆకాశంలో నక్షత్ర మండలం రథ ఆకారంలో కనబడుతుందని అంటారు. 25 (2+5=7) ఏడు సంఖ్య కూడా మంచిది. రథసప్తమి నాడు సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి, సూర్య నమస్కారాలు చేసి, సూర్యుణ్ని ఆరాధించడం వలన చ...